నా పేరు వాడుకోండి.. రతన్ టాటా
posted on Aug 25, 2015 10:48AM

ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా, సీఎం చంద్రబాబు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారు ఏపీకి ఉన్న సమస్యల గురించి.. అనేక ప్రాజెక్టుల గురించి మాట్లాడినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఏపీని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని.. పారిశ్రామిక వర్గాల్లో ఏం చేయాలో తనకు చెప్పాలని, భారతదేశంలోనే ఏపీని కంపెనీల స్థాపన కేంద్రంగా చేద్దామని రతన్ టాటా చంద్రబాబుతో అన్నట్టు తెలుస్తోంది. తనకు చాలా పరిచయాలు ఉన్నాయని వాటిని ఉపయోగించుకోవడానికి తన పూర్తి సహకారం అందిస్తానని.. అవసరమైతే నేనే వెళ్లి పనులు చేసుకొని వస్తానని రాష్ట్రాభివృద్ధికి తన పూర్తి సహకారం అందిస్తానని హామి ఇచ్చారు. నా ప్రితష్టను ఎక్కడ కావాలంటే అక్కడ మీరు వాడుకోవచ్చని చెప్పారు. కాగా భేటీ ముగిసిన అనంతరం ఢిల్లీకి బయలుదేరిన రతన్ టాటా తానే స్వయంగా విమానాన్ని నడుపుకుంటూ వెళ్లారు.
కాగా..ప్రధాని నరేంద్ర మోదీ సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజనను ప్రారంభించిన నేపథ్యంలో గ్రామాలను దత్తత తీసుకోవాలని.. టాటా ట్రస్ట్ తరుపున గ్రామాలను అభివృద్ధి చేయాలని కోరిగా దీనిలో భాగంగానే రతన్ టాటా ఏపీలో 264 గ్రామాలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.