Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చంద్రబాబుకు బులెట్ ప్రూఫ్ బస్సు.. 5 కోట్లు
posted on: Aug 21, 2015 3:42PM

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటనల నిమిత్తం ఏపీ ప్రభుత్వం ఈప్రత్యేక సౌకర్యాలతో కూడిన బులెట్ ప్రూఫ్ బస్సును కొనుగోలు చేసింది. సుమారు రూ.5 కోట్లతో ఆధునాతన సౌకర్యాలతో తయారైన ఈ బస్సు ఈ రోజు ఉదయం విజయవాడ చేరుకుంది. అయితే చంద్రబాబు కూడా విజయవాడలోనే ఉన్న నేపథ్యంలో దానిని పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. దీనిని ఆయన జిల్లా పర్యటనల్లో భాగంగా మాత్రమే ఉపయోగించనున్నారు.
చంద్రాబాబు ఈ బులెట్ ప్రూఫ్ బస్సును తయారు చేసే బాధ్యతను ఆర్టీసీ అధికారులకు అప్పగించడంతో వారు బెంజ్ కంపెనీకి చెందిన బస్సును కొనుగోలు చేసి.. ఛండీగఢ్‌లో దానిని బుల్లెట్ ప్రూఫ్‌గా తీర్చిదిద్దడం జరిగింది. ఈ బస్సు శక్తివంతమైన బాంబు దాడులను కూడా తట్టుకుని నిలుస్తుందని తెలుస్తోంది.






