TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏడు జిల్లాలకు స్పెషల్ ప్యాకేజీ... చంద్రబాబు

Published on: Tue Mar 10, 2015 3:25PM

 

ఆంధ్రప్రదేశ్ లో మంగళవారం శాసనసభలో చర్చలు బాగానే జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ... రాయలసీమ ఉత్తర ఆంధ్రాల్లోని ఏడు జిల్లాలకు కేంద్రం స్పెషల్ ప్యాకేజీ ఇచ్చిందని తెలిపారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే ఎన్నికల కంటే ముందే భాజపాతో పొత్తుపెట్టుకున్నామని అన్నారు. విశాఖ రైల్వేజోన్, రాజధానికి నిధులు, రెవెన్యూలోటు భర్తీ చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందనీ స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తీసుకొస్తామని, అంతేకాకుండా కేంద్రం కూడా రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. 30 ఏళ్లు నుండి నీతి నిజాయితీగా రాజకీయాల్లో కొనసాగుతున్నానని, ఎవరెన్ని అవినీతి ఆరోపణలు చేసినా పట్టించుకోనని అన్నారు. అవినీతికి పాల్పడేవాళ్లే అలాంటి మాటలు మాట్లడతారని చెప్పారు.