చంద్రబాబు మోడీల భేటీ.. సర్వత్ర ఉత్కంఠం

 

ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీకి ప్రత్యేక హోదా.. ప్రత్యేక ప్యాకేజీ విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారో అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ కూడా పాల్గొంటారు.   

 

మరోవైపు ఇప్పటికే ఏపీకి కావలసిన అవసరాలు.. ఉన్న సమస్యలకు సంబంధించిన 200 పేజీల ముసాయిదాను ఏపీ ప్రభుత్వ తయారు చేసుకుంది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వ ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ కావలసినంత ఇవ్వడానికి ఉన్నా ప్రత్యేక హోదా విషయంలో మాత్రం కాస్తంత వెనుకాడుతున్న నేపథ్యంలో చంద్రబాబు మాత్రం ఎలాగైనా ప్రత్యేక హోదా సాధించాలని పట్టుదలతో ఉన్నారు. ఉత్తరఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ.. ప్రత్యేక హోదా ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేయనున్నారు.

 

అయితే మరి కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందా?లేదా? ప్రత్యేక ప్యాకేజీ ఎంతిస్తారు? విభజన చట్టంలోని హామీలను అమలు చేస్తారా? ఏపీకి కావలసిన అన్ని అవసరాలను తీరుస్తుందా? ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరకాలంటే వారి భేటీముగిసే వరకు ఆగాల్సిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu