బాలికపై వైసీపీ యువకులు అత్యాచారయత్నం.. వీళ్లకు ఇంత ధైర్యం ఇచ్చింది ఎవరు?

రాజమండ్రి రూరల్ లో 10ఏళ్ల ముస్లిం మైనర్ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారయత్నం చేశారు. అత్యాచారయత్నం చేసింది వైసీపీకి చెందినవారిగా గుర్తించారు. అయితే వారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరించడంతో తల్లిదండ్రులు కామ్ గా ఉన్నారు. ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయాలని వేధింపులకు గురిచేస్తుండడం, చంపేస్తామని బెదిరిస్తుండడంతో తమను సీఎం జగనే కాపాలంటూ వేడుకుంటున్నారు.

 

కాగా, ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. "రాజమండ్రి రూరల్ లో అభం శుభం తెలీని 10 ఏళ్ల ముస్లిం మైనర్ బాలికపై ముగ్గురు వైసీపీ యువకుల అత్యాచారాయత్నాన్ని ఖండిస్తున్నాం. పైగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరింపులా? ఈ అరాచక మూకలకు ఇంత ధైర్యం ఇచ్చింది ఎవరు?" అని ప్రశ్నిస్తూ.. బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియోని చంద్రబాబు పోస్ట్ చేశారు.

"16ఏళ్ల దళిత మైనర్ బాలికపై 12మంది గ్యాంగ్ రేప్ చేసి పోలీస్ స్టేషన్ ముందే వదిలేసిన దుర్ఘటన కళ్లముందే ఉంది. కర్నూలులో గిరిజన మహిళను భర్త కళ్లముందే అతిదారుణంగా గ్యాంగ్ రేప్ చేశారు. దిశచట్టం అసలు అమల్లో ఉందా? ఇప్పటికైనా పోలీసులు నిద్రమత్తు వీడి నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలి." అని చంద్రబాబు డిమాండ్ చేశారు.