Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...దేశానికి తీరని లోటు - చంద్రబాబు
posted on: Aug 8, 2018 12:35PM

తమిళనాడు మాజీ సీఎం కరుణానిధికి ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు.. గుంటూరు జిల్లా మంగళగిరిలో నోడల్ అధికారుల రాష్ట్రస్థాయి సదస్సు సందర్భంగా చంద్రబాబు సంతాప తీర్మానాన్ని చదివి వినిపించారు.. 'కరుణానిధి కోట్ల మందిని ప్రభావితం చేసిన విలక్షణ నాయకుడు.. తమిళనాడులో తిరుగులేని నేత.. దక్షిణ భారతదేశంలో పెద్ద రాజకీయ శక్తిగా ఇన్ని సంవత్సరాల పాటు కొనసాగారు.. రాజకీయ రంగంలోనే కాకుండా కళా రంగంలోనూ తనదైన ప్రత్యేకత చాటుకున్నారు.. ఎన్నో సామాజిక మార్పులకు నాంది పలికారు.. కరుణానిధితో నాకు మంచి అనుభవం ఉంది.. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌తో ఆయన చాలా సన్నిహితంగా మెలిగేవారు.. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసినప్పుడు కరుణానిధి అండగా నిలిచారు.. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని ఏర్పాటుచేసుకున్న కరుణానిధి చనిపోవడం తమిళనాడుతో పాటు దేశానికి తీరని లోటు' అని చంద్రబాబు అన్నారు.






