కుప్పం నా అడ్డా.. పొత్తుల‌పై చంద్రబాబు స్ప‌ష్ట‌త‌!

posted on: Jan 7, 2022 1:51PM

"రాష్ట్రం వైసీపీ జాగీరా? మీకు రాష్ట్రాన్ని రాసిచ్చారా? నేను కుప్పం వదిలి ఎందుకు వెళ్లాలి? వీళ్లకు భయపడుతాననుకుంటున్నారా?" అంటూ కుప్పం ప‌ర్య‌ట‌న‌లో చంద్ర‌బాబు వైసీపీపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. 

వైసీపీ కార్యకర్తల్లోనూ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందన్నారు. కుప్పం నుంచే ఈ అరాచక పాలనకు చరమగీతం పాడాలని పిలుపిచ్చారు చంద్ర‌బాబు. ఎన్నికల కోసం తాను కుప్పం రాకున్నా.. ఏడుసార్లు ఇక్క‌డి ప్రజలు గెలిపించారని.. వాళ్లతో తనది భావోద్వేగపూరిత అనుబంధమని చంద్రబాబు అన్నారు.

ఈ సంద‌ర్భంగా పొత్తుల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు టీడీపీ అధినేత‌. పొత్తులు అనేవి ఎన్నికల్లో భాగమని, పరిస్థితులను బట్టి పొత్తులు అనేది కొనసాగుతాయన్నారు. గతంలో తాము పొత్తులు పెట్టుకున్నప్పుడు గెలిచిన, ఓటమి పాలైన సందర్భాలూ ఉన్నాయన్నారు. పొత్తులు లేనప్పుడు కూడా గెలిచామని.. ఈ విషయాన్ని వైసీపీ నేతలు గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రజలు ఓట్లేయాలనుకుంటే అన్నీ జరుగుతాయని చంద్రబాబు అన్నారు. 

తానొక విజన్‌తో ఏపీని అభివృద్ది చేస్తే..‌ వైసీపీ అధికారంలోకి వచ్చి నాశనం చేసిందన్నారు. ప్రభుత్వం చేస్తున్న అప్పులకు.. సంక్షేమ పధకాలకు సంబంధం ఉందా? అని ప్రశ్నించారు. సీఎం జగన్‌ విధ్వంసకారి అని.. కక్ష, కార్పణ్యాలు, బెదిరింపులతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. పేదల ద్రోహి అని మండిపడ్డారు. మీడియా, న్యాయవ్యవస్థతో పాటు ప్రజల్ని బెదిరిస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...