చంద్రబాబు 63 ఏళ్లు 63 రోజులు 1000 కిలోమీటర్లు

 

chandrababu, 1000 chandrababu pada yatra, chandrababu mee kosam yatra, chandrababu yatra

 

చంద్రబాబు నాయుడు "వస్తున్నా మీ కోసం" యాత్రలో రికార్డ్ సృష్టించారు. 63 ఏళ్లలో 63 రోజుల్లో1000 కిలోమీటర్లు పూర్తి చేయడం విశేషం. అక్టోబర్ 2న ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాదయాత్ర నేటికి 63వ రోజుకు చేరుతుంది. ఆరు, మూడు కలిపితే 9 సంఖ్య వస్తుంది. అదే విధంగా సోమవారంనాటి తేదీ 3.12.12. ఈ మూడింటిని కూడితే కూడా 9 వస్తోంది. పైగా, చంద్రబాబు వయస్సు 63 ఏళ్లు. ఇదీ 9 సంఖ్యను తెచ్చిపెడుతోంది. చంద్రబాబు పాదయాత్ర చేపట్టిన వేయి కిలోమీటర్లు పూర్తన్న సమయంలో 9 అదృష్ట సంఖ్య కలిసి వచ్చిందని, ఇది శుభసూచకమని అంటున్నారు.


నిజామాబాద్ జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర 1000 కిలోమీటర్లు దాటనున్నారు. 62 రోజుల్లో ఐదు జిల్లాల్లో యాత్రను పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఈ . బోధన్ మండలం పెంటాఖుర్దులో చంద్రబాబు 1000 కిలోమీటర్ల మైలురాయి దాటనున్నారు.  ఈ విశిష్ట సందర్భాన్ని పురస్కరించుకొని టీడీపీ శ్రేణులు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. 1982 డిసెంబర్ 2న జాడి జమాల్‌పూర్‌లో ఎన్టీఆర్ బస చేసిన సందర్భాన్నీ గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు బాబు కూడా డిసెంబర్ 3న అదే గ్రామంలో బస చేయనున్నారు. ఈ సందర్భంగా ఆ గ్రామంలో స్తూపాన్ని ఏర్పాటు చేస్తున్నారు.



జాడి, పెంటాఖర్దుల్లో ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ విగ్రహాలను బాబు ఆవిష్కరిస్తారు. అలాగే వెయ్యి మంది మహిళలతో పాదయాత్ర నిర్వహించనున్నారు. మరోవైపు బాబు పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తిచేసుకుంటున్న సందర్భాన్ని రాష్ట్రమంతటా కార్యకర్తలు ఘనంగా జరుపుకుంటున్నారు.



చంద్రబాబు పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్బంగా విశాఖపట్నం జగదాంబ కూడలి వద్ద విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇంచార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్ మోకాళ్ల యాత్ర చేశారు. ఈ యాత్రకు నియోజకవర్గం కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.