బాబు పాదయత్రకి బ్రేక్?

 

నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు. అయితే, ఇప్పటికే కాలి నొప్పులతో ఇబ్బందులు పడుతున్న ఆయన, ఈ రోజు కాలి చిటికన వ్రేలు మరింత వాచిపోవడంతో వైద్యుల సలహా మేరకు రేపు అనగా ఆదివారం తన పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి ఒక రోజు పూర్తీ విశ్రాంతి తీసుకొనేందుకు అంగీకరించారు.

 

అయితే, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొంటూ రేపు జిల్లా నాయకులూ, కార్యకర్తలతో సమావేశం అయ్యి, నేతల మద్య నెలకొన్న విబేధాలు తొలగించే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఎన్నికలు ముంచు కోస్తున్న తరుణంలో పార్టీకి కంచుకోట వంటి కృష్ణా జిల్లాలో నేతల మద్య తలెత్తుతున్న తీవ్ర విబేధాల వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోవడమే గాకుండా, ఇతర పార్టీలకు తమ కంచుకోటలోకి ప్రవేశం కల్పించినట్లవుతుంది అని భావిస్తున్న చంద్రబాబు రేపు జిల్లా నేతలతో సమావేశం అయి పరిస్థితులను చక్క దిద్దే ప్రయత్నం చేయవచ్చును.