TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సింగపూర్‌లో చంద్రబాబు ఏం చేశారు?

Published on: Mon Mar 30, 2015 11:10AM

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని బృందం సింగపూర్‌లో పర్యటిస్తోంది. సింగపూర్ మంత్రి షణ్ముగం, రాయబారి పిళ్ళైతో సోమవారం నాడు చంద్రబాబు అల్పాహార విందులో పాల్గొన్నారు. సింగపూర్ పారిశ్రామిక మంత్రి ఈశ్వరన్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. చంద్రబాబు బృందం సోమ, మంగళవారాల్లో సింగపూర్‌లో పర్యటిస్తుంది. ముఖ్యమంత్రితో సింగపూర్‌కి వెళ్ళిన బృందంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి టక్కర్, సీఎం ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర, పరిశ్రమల శాఖ కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్, పురపాలక శాఖ కార్యదర్శి గిరిధర్, సీఆర్‌డిఎ సీఇఓ శ్రీకాంత్ ఉన్నారు. సోమవారం నాడు చంద్రబాబు బృందం సింగపూర్ ప్రభుత్వంతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. సీఆర్డీయే అభివృద్ధి, రాజధాని మాస్టర్ ప్లాన్‌పై సమావేశంలో చర్చించారు.