Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆ డబ్బు ఎవడబ్బ సొమ్ము?
posted on: May 1, 2014 2:08PM
.jpg)
సీమాంధ్ర ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఘాటు పదజాలంతో కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలను ఏకిపారేస్తున్నారు. కేసీఆర్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని, సైకిల్ స్పీడు పెంచి, గేరు మార్చి కేసీఆర్ని తొక్కిపారేస్తానని చంద్రబాబు చెప్పారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అడ్రస్ లేకుండా పోయిందని, భవిష్యత్తులో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీని కనిపించకుండా చేస్తానని చంద్రబాబు అన్నారు. జగన్ పార్టీ ఈ ఎన్నికలలో డబ్బు వెదజల్లుతోందని, అసెంబ్లీ స్థానానికి 30 కోట్లు, పార్లమెంట్ స్థానానికి 60 కోట్లు ఖర్చుపెడుతోందని, ఈ డబ్బంతా ఎవడబ్బ సొమ్ము అని చంద్రబాబు గట్టిగా ప్రశ్నించారు. జగన్‌కి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టేనని, అంటూ ఎన్నికల తర్వాత జైల్లో వుండే జగన్‌కి ఓటేస్తే ప్రజలే నష్టపోతారని చెప్పారు.


.jpg)



