Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చంచల్‌గూడ జైలు మూలఖత్ పై నిఘా కన్ను
posted on: Feb 21, 2026 1:08PM

హైదరాబాద్ నగర భద్రతను కుదిపేసేలా ఓ సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ చంచల్‌గూడ కేంద్ర కారాగారాన్ని కేంద్రంగా చేసుకుని ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ మేరకు నగర భద్రతా వ్యవస్థను అప్రమ త్తం చేశాయి. జైలులో ఉన్న ఓ ఉగ్రవాది మూలాఖత్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ బయట ఉన్న తన అను చరులతో రహస్యంగా సమాచార మార్పిడి జరిపినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్టు సమాచారం రావడంతో పోలీసులు, దర్యాప్తు సంస్థలు అప్రమత్తమయ్యాయి.
ఇప్పటికే నగరం లో వరుస పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. వారి నుంచి లభించిన సమాచారం ఆధారంగా మూసారాంబాగ్, సైదాబాద్, మలక్‌పేట్ తదితర ప్రాంతాల్లో నిఘా కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక బృందాలు అనుమానాస్పద కదలికలను నిశితంగా గమనిస్తూ, బాంబ్ స్క్వాడ్లు, డాగ్ స్క్వాడ్లు కూడా రంగంలోకి దించి తనిఖీలు చేపట్టారు. నిఘా వర్గాల ప్రకారం లష్కరే తోయిబాకు అనుబంధంగా ఉన్న ఓ ఖైదీ జైలులో నుంచే కుట్రకు మార్గదర్శనం చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి.
ములాఖత్‌కు వచ్చిన వ్యక్తులతో రహస్య సంకేతాల ద్వారా ఉగ్రదాడుల ప్రణాళికపై చర్చలు జరిపినట్లు దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఖైదీని కలిసేందుకు వచ్చిన అతని భార్య ద్వారా కీలక సమాచారం బయటకు చేరే అవకాశం ఉందన్న కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.ఈ ఘటన తో జైలు భద్రతా వ్యవస్థపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ములాఖత్ విధానంలో ఎలాంటి లోపాలు ఉన్నాయి? సందర్శకుల తనిఖీ ప్రక్రియలో ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగిందా? అనే అంశాలపై అధికారులు సమగ్రంగా పరిశీలిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే జైలులోని సీసీ కెమెరా దృశ్యాలు, సందర్శకుల రిజిస్టర్లు, కాల్ డేటా, ఖైదీల కదలికలు తదితర వివరాలను సేకరించి విశ్లేషిస్తున్నారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు చోటుచేసుకో కుండా ముందస్తు చర్యలు గా సున్నిత ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలు అప్రమత్తం గా ఉండాలని, అనుమానా స్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఉన్నతాధికారులు సూచించారు.ఈ వ్యవహా రంపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉండగా, దర్యాప్తు పలు కోణాల్లో కొనసాగుతోంది.






