వనస్థలీపురంలో కాల్పుల కలకలం

posted on: Nov 2, 2015 11:32AM



 హైదరాబాద్ నగరంలోని వనస్థలీపురంలో కాల్పుల కలకలం రేగింది. వివరాల ప్రకారం.. వనస్థలీపురంలో ఆటోనగర్ రాజధాని హోటల్ దగ్గర సుష్మా సాయినగర్ కు చెందిన అనురాధ అనే మహిళ మెడలో ఉన్న చైన్ ను లాక్కెళ్లడానికి ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించగా ఇది గమనించిన యాంటీ స్నాచింగ్ టీమ్ రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో చైన్ స్నాచర్లు బ్లాక్ పల్సర్ పై పారిపోయారు. యాంటీ స్నాచింగ్ టీమ్, పోలీసులు  చైన్ స్నాచర్ల కోసం ఎల్బీనగర్, వనస్థలీపురం ప్రాంతంలో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...