చంద్రబాబు దావోస్ పర్యటనపై కేంద్రం యూ టర్న్

posted on: Jan 5, 2019 12:04PM

 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దావోస్ పర్యటనకు లైన్‌ క్లియర్‌ అయింది. ఈ పర్యటనకు పూర్తి స్థాయి బృందంతో వెళ్లేందుకు విదేశాంగ శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వివిధ దేశాలకు చెందిన వాణిజ్య, పారిశ్రామిక ప్రముఖులు, ప్రభుత్వాల ప్రతినిధులతో ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలు నెలకొల్పేందుకు, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు చంద్రబాబు ఏటా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరవుతున్నారు. ఆయన వెంట మంత్రులు, అధికారులతో కూడిన భారీ ప్రతినిధి బృందం దావోస్‌కి వెళ్లడం ఆనవాయితీ. కానీ ఈ ఏడాది చంద్రబాబు దావోస్‌ పర్యటనపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది.  

దావోస్‌ పర్యటనను ఏడు రోజులకు బదులుగా నాలుగు రోజులకే కుదించుకోవాలని కేంద్రం స్పష్టంచేసింది. ముఖ్యమంత్రి వెంట 14 మంది ప్రతినిధులు వెళ్లేందుకు అనుమతి కోరగా... నలుగురికే అనుమతి ఇచ్చింది. కాగా కేంద్రం తీరుపై చంద్రబాబు, మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ముఖ్య‌మంత్రి సూచ‌న‌ల మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం విదేశాంగ శాఖ‌తో సంప్ర‌దింపులు జ‌రిపింది. ఫ‌లితంగా నిర్ణ‌యంలో మార్పు చేసుకుంటూ కేంద్రం తాజాగా అనుమ‌తుల‌ను జారీ చేసింది. అయితే బృందంతో వెళ్లేందుకు అనుమతి ఇచ్చిన విదేశాంగ శాఖ..పర్యటనను మాత్రం నాలుగు రోజులకే పరిమితం చేసింది. ఈ క్రమంలో 14 మంది బృందం తో ఈ నెల 22న చంద్రబాబు దావోస్‌ వెళ్లనున్నారు. 25వ తేదీ వరకు ఈ పర్యటన కొనసాగుతుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...