Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బాయిల్డ్ రైస్ తీసుకోం.. కేసీఆర్‌కు కేంద్రం క్లారిటీ..
posted on: Nov 18, 2021 3:35PM
కేంద్రం వరి కొంటుందా? కొనదా? చెప్పాలంటూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం తరఫున మహా ధర్నా చేశారు. యాసంగిలో ధాన్యం కొనాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. లేదంటే పోరాటం ఆపోబోమంటూ హెచ్చరించారు. కేసీఆర్ బెదిరింపులకు భయపడేది లేదన్నట్టు.. ధర్నా ముగిసిన వెంటనే కేంద్రం నుంచి ఓ ప్రకటన వచ్చింది. పార్ బాయిల్డ్ రైస్ తీసుకోబోమంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. యాసంగిలో పంట ధాన్యం కూడా పరిమితంగానే కొంటామని తేల్చి చెప్పింది. వరి కొనుగోలుపై కేంద్రం వర్సెస్ తెలంగాణ ఎపిసోడ్ మరింత ముదిరినట్టే కనబడుతోంది.
‘‘ఒక్కో రాష్ట్రం నుంచి డిమాండ్ ఒక్కో విధంగా ఉంటుంది. డిమాండ్లకు అనుగుణంగా రాష్ట్రాలతో జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం. ఇప్పటి వరకు జరిగిన నిర్ణయాల ప్రకారం బాయిల్డ్ రైస్ కేంద్రం కొనదు. వరి, గోధుమ పంటను తక్కువ పండించాలని రాష్ట్రాలను కోరుతున్నాం. ప్రస్తుతం.. దేశంలో నిల్వలు సరిపడా ఉన్నాయి. అవకాశం ఉన్నంత మేరకు ఎగుమతి చేయడానికి ఉన్న అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటున్నాం. ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాలని సూచనలు చేస్తున్నాం. ఆయిల్, పప్పు ధాన్యాలు ఎక్కువ పండించాలని అన్ని రాష్ట్రాలకు సూచనలు చేస్తున్నాం. రాష్ట్రాలు ఎంత వరకు సేకరించగలుగుతాయో అంత వరకే పరిమితం కావాలని చెబుతున్నాం.’’ అని కేంద్రం ప్రకటించింది. మరి కేంద్ర ప్రకటనపై సీఎం కేసీఆర్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి...



(11).webp)


