పేదలకు ఇళ్ళు.. కేంద్రం ఓకే!

posted on: Aug 3, 2024 4:03PM

పేద ప్రజలకు శుభవార్త. దేశవ్యాప్తంగా రెండు కోట్ల ఇళ్ళ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని కేంద్ర మంత్రి పెమ్మసాని  చంద్రశేఖర్ తెలిపారు. గత ప్రభుత్వ విధానాల వల్లే పేదల ఇళ్ళ నిర్మాణంలో రాష్ట్రం వెనుకబడిందని ఆయన చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధులను సక్రమంగా వినియోగించుకుని వుంటే, ఇప్పటికి రాష్ట్రంలో పేదలకు 5 నుంచి 6 లక్షల ఇళ్ళు కట్టి వుండవచ్చని తెలిపారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి కేంద్రం పరిమితులు లేకుండా నిధులు మంజూరు చేస్తోందని వివరించారు. నరేగా నిధుల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. పూర్తి స్థాయిలో నిధులు వినియోగించుకుని జల్ జీవన్ మిషన్‌ని పూర్తి చేసుకోవాల్సిన వుందని ఆయన వివరించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...