గోదావరి పుష్కరాలకు వంద కోట్లు విడుదల చేసిన కేంద్రం

posted on: Oct 11, 2024 9:55AM

గోదావరి పుష్కరాల కోసం కేంద్రం వంద కోట్ల రూపాయలను విడుదల చేసింది. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల నిర్వహణకు ఏపీకి వంద కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులతో పాటు నిధులను  కూడా విడుదల చేసింది. గోదావరి పుష్కరాలు 2027లో జరుగుతాయి.

అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా కేంద్రం ఈ నిధులను విడుదల చేసింది. దీంతో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు ముమ్మరం కానున్నాయి. టూరిజం శాఖ అధికారులు అఖండ గోదావరి ప్రాజెక్టు పనులను త్వరలో ప్రారంభించనున్నారు. 

అఖండ గోదావరి ప్రాజెక్ట్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తూర్పు గోదావరి జిల్లాకు ఈ నిధులు కేటాయించారు. ఈ దిశగా టూరిజం శాఖ అధికారులు పనులు త్వరలో ప్రారంభంకానున్నాయని అధికారులు తెలిపారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...