Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టీటీడీలో మరోసారి లోపించిన భద్రత
posted on: Oct 16, 2019 11:17AM

కలియుగ దైవం శ్రీనివాసుడ్ని దర్శంచుకోవాలంటే అనేక తనికీలు నిర్వహిస్తారు భద్రత సిబ్బంది. కానీ తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బట్టబయలైంది. భద్రతా సిబ్బంది కళ్లు గప్పి ఓ భక్తుడు ఏకంగా శ్రీవారి ఆలయంలోకి సెల్ ఫోన్ తీసుకువెళ్లి ఫొటోలు తీసేందుకు ప్రయత్నించగా, విధుల్లో ఉన్న టిటిడి సిబ్బంది అడ్డుకుని విజిలెన్స్ సిబ్బందికి అప్పగించారు. తాను విదేశీ భక్తున్నని విజిలెన్స్ సిబ్బందికి చెప్పడంతో భద్రతాధికారులు ప్రశ్నించి వదిలేశారు. ఆలయంలోని సివిల్ ఏఆర్, టిటిడి విజిలెన్స్, ప్రైవేట్ సెక్యూరిటీ హోమ్ గార్డులతో పాటు ఆక్టోపస్ బలగాలు తిరుమల భక్తులను పర్యవేక్షిస్తున్న కూడా భద్రతా వైఫల్యాలు తరచూ బయటపడుతున్నాయి. శ్రీ వారి దర్శనం కోసం ఆలయంలోకి ప్రవేశించే ముందు మూడు సార్లు భద్రతా సిబ్బంది భక్తులను క్షుణ్నంగా తనిఖీ చేస్తారు. అయినా కొంత మంది భక్తులు మాత్రం నిషేధిత వస్తువులను శ్రీ వారి ఆలయంలోకి తీసుకువెళ్లడం పరిపాటిగా మారింది. వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో ఓ విదేశీ భక్తుడు భద్రతా సిబ్బంది తనిఖీలను తప్పించుకుని సెల్ ఫోన్ లో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాడు.
సెల్ ఫోన్తో ఆలయంలో కి ప్రవేశించిన భక్తుడు ఆలయంలో ఫొటోలు తీసేందుకు ప్రయత్నించగా అక్కడే విధుల్లో ఉన్న టీటీడీ సిబ్బంది అప్రమత్తమై వెంటనే భక్తుని పట్టుకొని విజిలెన్స్ సిబ్బందికి అప్పగించారు. భక్తుని ప్రశ్నించగా విజిలెన్స్ అధికారులు తాను విదేశీ భక్తున్నని ఆలయంలోకి సెల్ ఫోన్ తీసుకురావడం నిషిద్ధమని తనకు తెలియదని చెప్పడంతో విజిలెన్స్ సిబ్బంది భక్తుడి వద్ద వివరణ తీసుకుని వదిలేశారు. తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో టిటిడి సిబ్బంది పై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారులు .ఇక పై అయినా టీటీడీ బృందం ఇలాంటి తప్పిదాలకు తావు ఇవ్వకుండా ఉండేలా చూసుకోవాలని టీటీడీ ఉన్నత అధికారులు అదేశాలు జారీ చేశారు.






