Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆక్వారైతుల రుణాలపై మారటోరియం.. కేంద్రానికి చంద్రబాబు లేఖ
posted on: Sep 15, 2025 12:51PM
అమెరికా టారిఫ్ ల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆక్వారైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ సహా వాణ్యజ్య, మత్స్య శాఖ మంత్రులకు ఆయన వేర్వేరుగా లేఖలు రాశారు. అమెరికా టారిఫ్ ల కారణంగా ఆక్వారంగానికి పాతిక వేల కోట్ల రూపాయమల నష్టం వాటిల్లిందన్నారు.
దాదాపు 50 శాతం ఎగుమతుల ఆర్డర్లు నిలిచిపోయాయన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆక్వా రైతులను ఆదుకోవడానికి ముందుకు రావాలని చంద్రబాబు ఆ లేఖలలో కోరారు. ఆక్వారైతులు నష్టపోకుండా ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో కేంద్రం స్పష్టమైన విధానాన్ని అవలంబించాలన్నారు. ఆక్వా ఉత్పత్తుల రవాణాకు డెడికేటెడ్ రైళ్లు నడపాలని కోరారు. అలాగే ఆక్వారైతుల రుణాలపై మారటోరియం విధించాలని చంద్రబాబు కేంద్ర మంత్రులను కోరారు.






