Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...75 ఏళ్ల వయసు.. 15 ఏళ్ల పరుగు
posted on: Oct 10, 2025 4:47PM

అలుపెరుగని ప్రగతి శ్రామికుడు చంద్రబాబు
ముఖ్యమంత్రిగా 15మైలురాయి దాటిన విజనరీ లీడర్
నాలుగు దశాబ్దాల ప్రజా జీవితంలో నారా చంద్రబాబునాయుడు ఎన్నో మైలు రాళ్లను అధిగమించారు. ఎన్నెన్నో విజయాలను సాధించారు. రాజకీయ నేపథ్యం లేకుండా ఒక సాధారణ కుటుంబం నుంచి ఆయన రాజకీయాలలోకి ప్రవేశించి అనితర సాధ్యమనదగ్గ విజయాలను అందుకున్నారు. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా సుదీర్ఘకాలం ఉన్నారు. అటువంటి చంద్రబాబునాయుడు ఈ రోజు మరో అద్భుత, అసాధారణ మైలు రాయిని చేరుకున్నారు. అదేమిటంటే సీఎంగా 15 ఏళ్లు పని చేసిన రికార్డును సాధించారు. దక్షిణభారత దేశంలో ఈ మైలు రాయిని అందుకున్న మూడో వ్యక్తిగా నిలిచారు. అలాగే ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా చంద్రబాబు ఘనత సాధించారు. చంద్రబాబు తొలి సారిగా 1995 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నారా చంద్రబాబు నాయుడు అను నేను.. అంటూ 15 ఏళ్ల కిందట తొలి సారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ఆ తరువాత మరో మూడు సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు సార్లు, విభజత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండు సార్లు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.
దేశం మొత్తంలో సుదీర్ఘ కాలం సీఎంలుగా పని చేసిన నేతలు ఎందరున్నా.. దక్షిణాదిలో ఈ ఘనత సాధించిన నాయకులు చంద్రబాబుకు ముందు కేవలం ఇద్దరు మాత్రమే. వారిలో తమిళనాడు మాజీ సీఎం కరుణానిథి దాదాపు 19 సంవత్సరాలు సీఎంగా పని చేశారు. ఆయన తరువాత పుదుచ్చేరి సీఎంగా ఎన్.రంగసామి 16 ఏళ్ల ఉన్నారు. వారి తరువాత దక్షిణ భారత దేశంలో అత్యధిక కాలం సీఎంగా ఉన్న ఏకైక వ్యక్తి నారా చంద్రబాబునాయుడు మాత్రమే.
చంద్రబాబు రికార్డులు చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక కాలం సీఎంగా పని చేసిన రికార్డు చంద్రబాబుదే. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సఎంగా దాదాపు తొమ్మదేళ్లు పని చేశారు. యాక్యురేట్ గా చెప్పాలంటే ఉమ్మ డి ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబునాయుడు ఎనిమిది సంవత్సరాల 255 రోజులు సీఎంగా ఉన్నారు. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఆయన పదవీకాలం ఇప్పటికి ఆరేళ్ల 110 రోజులు. మొత్తం కలిపితే 15 సంవత్సరాల మైలు రాయి దాటారు. అయితే దక్షిణ భారత దేశం నుంచి చంద్రబాబు కంటే ఎక్కువ కాలం సీఎంలుగా సేవలందించిన కరుణానిథి, రంగసామిల కంటే సీఎంగా చంద్రబాబు చంద్రబాబు నాయుడు పాలనా విధానం ప్రపంచ దేశాల మన్ననలు అందుకుంది. ఆయన విజన్ కు, పని విధానానికి, ప్రగతి, సంక్షేమాల పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధికీ ప్రపంచ దేశాల నాయకులు ఫిదా అయ్యారు. బిల్ క్లింటన్ వంటి నాయకుడు కూడా చంద్రబాబు విజన్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
హైదరాబాద్ ఐటీ రంగానికి ఊపిరి పోసిన హైటెక్ సిటీ నిర్మాణం, లక్షల మందికి ఉపాధి ఇవన్నీ చంద్రబాబు దూరదృష్టిని ప్రత్యక్ష తార్కానాలే. ఇక చందర్బాబు చేపట్టిన విద్యుత్ సంస్కరణలు రాజకీయంగా చంద్రబాబుకు నష్టం చేశాయి. అప్పట్లో పార్టీ పరాజయానికి ప్రధాన కారణమయ్యాయి. అయితే ఆ తరువాత వాటి ఫలాలు అందాయి. నాలుగు దశాబ్దాలకు పైబడిన చంద్రబాబు రాజకీయ జీవితంలో అవినీతి మచ్చ, నేర మరక లేదని ఆయన ప్రత్యర్థులే అంగీకరిస్తారనడంలో అతిశయోక్తి లేదు. రాజకీయ వైరంతో చంద్రబాబుపై అవినీతి మరక అంటించేందుకు ప్రత్యర్థులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. జయాపజయాలు రాజకీయ నాయకులకు సహజం. కానీ వాటితో నిమిత్తం లేకుండా ఎప్పుడూ జనంలోనే ఉంటూ వారిలో ఒకడిగా మమేకమయ్యే లక్షణమే చంద్రబాబు నాయుడిని ప్రజానేతగా నిలబెట్టింది. చంద్రబాబు నాయుడు కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, రాజనీతిజ్ణుడిగా కూడా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు.






