తానా సభలకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం

 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి తానా మహాసభలకు ఆహ్వానం అందింది. ఈ ఏడాది జులై 3 నుంచి 5 వరకు అమెరికాలోని డెట్రాయిట్‌లో జరిగే తానా సమావేశాలు రావాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబును తానా ప్రతినిథులు ఆహ్వానించారు.  తానా చైర్మన్ గంగాధర్ నాదెళ్ల, తానా కాన్ఫరెన్స్ డెరక్టర్ సునీల్ పాంత్రా, మాజీ  అధ్యక్షుడు జయరాం కోమటి తదితరులు చంద్రబాబును కలిసి ఈ మేరకు ఆహ్వానం అందజేశారు.

కాగా తనను కలిసిన తానా ప్రతనిథులలో చంద్రబాబు కొద్ది సేపు ముచ్చటించారు. అమెరికాలో తెలుగు సంస్కృతిని పరిరక్షించేందుకు తానా చేస్తున్న కృషిని అభినందించారు. ప్రతి రెండేళ్లకు ఒక సారి నిర్వహించే తానా తెలుగు మహా సభలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులు పెద్ద సంఖ్యలో హాజరౌతారు. ఈ సందర్భంగా చంద్రబాబు తానా ప్రతినిథులతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పెట్టుబడులలో ప్రవాసాంధ్రుల పాత్ర గురించి చర్చించారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu