Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఉర్సు మహోత్సవాలకు చంద్రబాబుకు ఆహ్వానం
posted on: Oct 18, 2025 1:11PM

కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు మహోత్సవాలకు హాజరు కావాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. ఈ మేరకు అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి హజ్రత్ కేఎస్ఎస్ ఆరిఫుల్లా చంద్రబాబును కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు.
జాతీయ స్థాయిలో పేరొందిన ఈ ఉర్సు మహోత్సవాలు వచ్చే నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఉర్సు మహోత్సవ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు దర్గాపీఠాధిపతిని అడిగి తెలుసుకున్నారు. ఉర్సు మహోత్సవాలని నిర్వహణకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.






