TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నారావారిపల్లెకు ముఖ్యమంత్రి చంద్రబాబు

Published on: Sun Nov 17, 2024 10:15AM

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి అంత్యక్రియలు ఆదివారం ఆయన స్వగ్రామంలో జరుగనున్నాయి. రామూర్తి నాయుడు అంత్యక్రియల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు.  శనివారం మధ్యాహ్నం రామ్మూర్తినాయుడు హైద్రాబాద్ లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో మరణించిన సంగతి తెలిసిందే.  తిరుపతి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం గుండా నారావారిపల్లెకు చంద్రబాబు చేరుకున్నారు.  అంత్యక్రియలకు కూటమి నేతలతో బాటు మహరాష్ట్ర గవర్నర్ రాధాక్రిష్ణ తదితరులు పాల్గొననున్నారు. 
 కాగా నారా రామ్మూర్తి నాయుడు పార్దీవదేహం హైద్రాబాద్ నుంచి బయలు దేరి నారావారిపల్లెకు చేరుకుంది. మంత్రి లోకేశ్ తన చిన్నాన్న భౌతికకాయాన్నిదగ్గరుండి తీసుకొచ్చారు.  మధ్యాహ్నం రెండు గంటలకు అంత్యక్రియలు ప్రారంభమౌతాయి.