Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చంద్రబాబు సర్కార్.. టీమ్ఆంధ్రా!
posted on: Oct 29, 2025 3:28PM

సోషల్ మీడియా లో వైసీపీ పోస్టులు వెగటు పుట్టిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. మొంథా తుపాను ప్రభావ తీవ్రతను గుర్తించి.. సాధ్యమైనంత వరకూ ప్రాణ, ఆస్తినష్టం లేకుండా చేయాలన్న తపనతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత, మానవ వనరుల మంత్రి నారాలోకేష్ నిర్విరామంగా ఆర్టీజీఎస్ లో కూర్చుని సమీక్షలు, పర్యవేక్షణ చేయడంపై వైసీపీయూలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయడాన్ని తప్పుపడుతున్నారు.
పెను తుపాను నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడానికి ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డి విజయం సాధించిన విషయం తుపాను తీరం దాటిన తరువాత అందరికీ అవగతమైనా.. వైసీపీయులు మాత్రం ఆర్టీజీఎస్ కేంద్రంలో కూర్చుని షో చేశారంటూ పోస్టులు పెట్టడంపై సామాన్య జనాలలో సైతం ఆగ్రహం వ్యక్తం అవుతోంది. తీరా తుపాను దాటి.. నష్టం కనిష్ట స్థాయికి తగ్గించడానికి చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం, అధికారులు చేసిన కృషి, తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చిన తరువాత తీరిగ్గా కొందరు అసలు తుపాను ప్రభావం ఏమీ ఆంధ్రప్రదేశ్ మీద లేదు అంటూ మాట్లాడటం చూస్తుంటే వీరిక మారరా అన్న అభిప్రాయం కలుగుతోందంటున్నారు. కాకినాడ ఓడరేవులో 10 వ నంబర్ ,మచిలీపట్నం పోర్టులో ఎనిమిదో నంబర్ ప్రమాద సూచికలు ఎగురవేసినా అవి వీరికి కనిపించలేదా అని ప్రశ్నిస్తున్నారు.
శ్రీకాళహస్తి లో స్వర్ణముఖి నది పొంగి, కాళహస్తి రోడ్లు మునిగిపోయాయిన పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. ఇప్పుడు మొంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు స్వర్ణముఖి నది పొంగి ప్రవహించింది. కాళహస్తి రోడ్లు జలమయమయ్యాయి. ఆ పరిస్థితి కళ్లెదుట కనిపిస్తున్నా.. వీళ్ల కళ్లకు కనబడటం లేదా అని నిలదీస్తున్నారు. పెట్టుబడుల కోసం లోకేష్ ఆస్ట్రేలియాలో, చంద్రబాబు దుబాయ్ లలో పర్యటించి, ఒక రోజు విశ్రాంతి కోసం హైదరాబాద్లో మకాం వేస్తే.. విమర్శిస్తున్న వీరు, రాష్ట్రం తుపాను పంజాకు విలవిలలాడుతున్నా.. రాష్ట్రం ముఖం చూడకుండా బెంగళూరు ప్యాలెస్ లో విశ్రాంతి తీసుకుంటున్న జగన్ గురించి ఎందుకు మాట్లాడరని పరిశీలకుల నుంచి సామాన్య జనం వరకూ ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా మొంథా తుపాన్ బారి నుంచి రాష్ట్రం కనిష్ట నష్టంతో బయటపడిందంటే అందుకు కారణం చంద్రబాబు నాయకత్వంలో మంత్రులు, అధికారులూ అంతా టీమ్ఆంధ్రా అన్నట్లుగా కృషి చేయడమేనని ప్రశంసలు కురిపిస్తున్నారు.



.webp)


