TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వరుస సమీక్షలతో చంద్రబాబు బిజీబిజీ.. అధికారులకు దిశా నిర్దేశం

Published on: Thu Sep 26, 2024 9:28AM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలలోనూ పని స్తంభించిపోయింది. జడత్వం పేరుకుపోయింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ, అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. పని తీరు మెరుగుపరుచుకోవాలని ఆదేశిస్తున్నారు. ప్రజా సంక్షేమం, ప్రగతి లక్ష్యంగా పని చేయాలని సూచిస్తున్నారు. 

అందులో భాగంగానే గురువారం (సెప్టెంబర్ 26)   కీలక సమీక్షలు నిర్వహించనున్నారు. క్రీడా, యువజన సర్వీసులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షిస్తారు.  యువతకు ఉపాధి, పారిశ్రామిక రంగంలో  యువతకు ప్రోత్సాహం,  స్టార్టప్ కంపెనీల ఏర్పాటుపై ఈ సమీక్షలో చర్చించనున్నారు.  యూత్ పావసీ రూపకల్పనపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.  అలాగే గ్రామీణ క్రీడలకు ప్రోత్సాహం, స్టేడియాల అభివృద్ధి, గత ప్రభుత్వ హయాంలో క్రీడా శాఖలో అవినీతి వంటి అంశాలపై కూడా ఈ సమీక్షలో చర్చించే అవకాశం ఉంది. 

ఇక పారిశ్రామిక విధాన రూపకల్పనపై కూడా చంద్రబాబు సమీక్షిస్తారు.   ఇండస్ట్రీయల్ పార్కుల ఏర్పాటుపై చర్చిస్తారు.  పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిపై కూడా సమీక్షిస్తారు.  వరుస సమీక్షలతో అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్న చంద్రబాబు సాధ్యమైనంత త్వరలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టి, వాగ్దానాల అమలుకు సిద్ధం కావాలని భావిస్తున్నారు.