Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మెగా డీఎస్సీ అభ్యర్థులకు చంద్రబాబు ఆల్ ది బెస్ట్
posted on: Jun 6, 2025 12:27PM
.webp)
ఏపీలో లక్షలాది మంది నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఎంతో ఉత్కంఘగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ 2025 పరీక్షలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టారు. ఈ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పరీక్షలకు హాజరవుతున్న డీఎస్సీ అభ్యర్థులకు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ మేరకు "AP DSC 2025 ఉపాధ్యాయ నియామక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు శుభాకాంక్షలు!" అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇక, ఈ రోజు (జూన్ 6, 2025) ప్రారంభమైన ఈ పరీక్షలు ఈ నెల 30 తేదీ వరకు కొనసాగుతాయి. ఈ మెగా డీఎస్సీ కోసం రాష్ట్రవ్యాప్తంగా 137, ఇతర రాష్ట్రాల్లో 17 మొత్తం 154 పరీక్షా కేంద్రాల్లో ప్రతిరోజూ రెండు షిఫ్టులలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం షిఫ్టు 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, మధ్యాహ్నం షిఫ్టు 2:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు జరుగుతుందని అధికారులు తెలిపారు.
కాగా రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నిర్వహిస్తామని నారా లోకేష్ తన యువగళం పాదయాత్ర సందర్భంగా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ తరువాత తెలుగుదేశం కూటమి అధికారపగ్గాలు చేపట్టింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మెగా డీఎస్సీ ఫైలు మీదే తొలి సంతకం చేసిన సంగతి తెలిసిందే.


.webp)
.webp)


