Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ షురూ
posted on: Jul 18, 2020 4:18PM
మాజీ ఎంపీ, సీఎం జగన్ చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య 2019 మార్చ్ 19 న జరిగిన సంగతి తెలిసిందే. ఐతే ఈ హత్య కేసు పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సిట్ వేసి దర్యాప్తు చేసినా ఇంతవరకు హంతకులు ఎవరు...అసలు ఈ హత్య కు కారణం ఏంటనే విషయం ఇంతవరకు తెలీలేదు. ఐతే ఎపి హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించడంతో ఈ రోజు సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది. ఏడుగురు అధికారుల సిబిఐ బృందం ఈ రోజు కడప ఎస్పీ అన్బురాజన్ ను కలిసి వివేకా హత్యకేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుండి సీబీఐ అధికారులు వివేకా హత్య జరిగిన పులివెందులకు కూడా వెళ్లి క్షేత్ర స్థాయిలో దర్యాప్తు చేస్తారు.
ఐతే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దాదాపు 1300 మందిని విచారించినా ఎటువంటి పురోగతి సాధించలేదు. సిబిఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్బంగా హైకోర్టు కూడా ఇదే విషయాన్నీ ప్రస్తావిస్తూ ఈ కేసులో చిక్కుముడి వీడకపోవడాన్ని ప్రశ్నించింది. ఈ కేసును సిబిఐ వీలైనంత త్వరగా దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.






