TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పీఎంఓ అధికారిగా నమ్మించి మోసం.. కేసు నమోదుచేసిన సీబీఐ

Published on: Tue Oct 7, 2025 2:51PM

హైదరాబాద్‌లో మరో విచిత్రమైన మోసం వెలుగులోకి వచ్చింది. ప్రధానమంత్రి కార్యాలయంలో సీనియర్ అధికారి నంటూ నమ్మింది, ఆంధ్రప్రదేశ్‌ కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రభుత్వ సంస్థలను మోసం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిపై  సీబీఐ కేసు నమోదు చేసింది. పీఎంఓ అసిస్టెంట్ డైరెక్టర్‌ ఎ.కె.శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 2న  కేసు నమోదైంది. కాగా పీఎంవో డైరెక్టర్ ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో పీఎంఓ డిప్యూటీ  కార్యదర్శిగా పేర్కొంటూ ఈ లేఖను తిరుమల తిరుపతి దేవస్థానాల  కార్యనిర్వాహక అధికారికి వచ్చింది. పీఎంఓ లెటర్‌హెడ్‌పై ఉన్న ఈ లేఖలో  మే 10న తిరుమలలో మూడు ఎసీ డబుల్ బెడ్‌రూమ్‌లు కేటాయించడంతో పాటు శ్రీ వేంకటేశ్వర స్వామి సుప్రభాత దర్శనం కల్పించా లని కోరారు.

తీర్థ దర్శనం కోసం వచ్చిన ఈ లేఖను టిటిడి అధికారులు పీఎంఓకి ధృవీకరణ కోసం పంపగా, పీఎంఓలో రామారావు అనే డిప్యూటీ సెక్రటరీ ఎవరూ లేరనే విషయం  బయటపడింది. అయితే అధికారుల దర్యాప్తులో అదే వ్యక్తి, అదే మొబైల్ నంబర్ ఉపయో గించి ఆగస్టు 21న పూణేలోని సింబయోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ  వైస్ ఛాన్స లర్‌ను సంప్రదించినట్లు తేలింది. ఈసారి అతను పీఎంఓ జాయింట్ సెక్రటరీగా పరిచ యం చేసుకొని ఎంబీఏ అడ్మిషన్‌ కావాలని సిఫార్సు చేశాడు.. అంతేకాకుండా ఆగస్టు 29న మరో నకిలీ లేఖ వెలుగులోకి వచ్చింది.

పీఎంఓ జాయింట్ సెక్రటరీ సి.శ్రీధర్ పేరుతో మైసూరు తహసీల్దార్ కార్యాలయానికి లేఖ పంపించి, భూమి రికార్డులు ఇవ్వాలని అభ్యర్థించాడు. విచారణలో ఈ లేఖలో కూడా అదే మొబైల్ నంబర్ ఉపయోగించబడినట్లు పీఎంఓ గుర్తించింది. ఈ ఘటనలపై పీఎంఓ సమర్పించిన ఆధారాల మేరకు  సీబీఐ నిందితునిపై  మోసం, ఫోర్జరీ తో పాటు  ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66డి  కింద కేసు నమోదు చేసింది. నిందితుడి పూర్తి వివరాలు, అతని కార్యకలా పాల వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని వెలికితీయడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేసింది.