సిబిఐ ఉచ్చులో జగన్ కేసుల విచారణాధికారి గాంధీ

posted on: Jul 9, 2019 8:01PM

 

 

జగన్ ఎదుర్కొన్న ఇడి కేసుల లో దర్యాప్తు అధికారిగా పని చేసిన శ్రీనివాస గాంధీకి చెందిన ఆస్తుల పైన హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ‌ల్లో సీబీఐ అధికారులు ఈ రోజు దాడులు చేసారు. ఈ దాడులలో దాదాపు 3.75 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను అధికారులు గుర్తించారు. జగన్ కేసు దర్యాప్తు సందర్బంగా గాంధీ తీసుకున్న నిర్ణ‌యాలతో జ‌గ‌న్ మరియు అయన సతీమణి భారతి ఇబ్బంది ప‌డగా.. దీని పై జ‌గ‌న్ నేరుగా ప్ర‌ధాని మోడీకి ఫిర్యాదు చేయటంతో గాంధీని ఈడీ నుండి జీఎస్టీకి బ‌దిలీ చేశారు. అయన పై అప్పట్లోనే ఈడీ, కేంద్ర ఆర్థిక శాఖ మరియు పీఎంవోకు పలు ఫిర్యాదులు కూడా అందినట్టు సమాచారం. కాగా, గాంధీ ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు అని అంటారు. పదేళ్లకు పైగా అయన ఈడీ శాఖలో పనిచేశారు. దీనితో చంద్ర‌బాబుకు అ్య‌తంత స‌న్నిహితులని భావిస్తున్న కీల‌క శాఖల్లోని ఉన్నతాధికారుల పైన కేంద్రం దృష్టి సారించిన‌ట్లు స్పష్టమౌతోంది.

 

google-ad-img
    Related Sigment News
    • Loading...