సబితా, ధర్మానను జైలుకు పంపాల్సిందే: సిబిఐ

 

CBI Dharmana, CBI Sabita indra reddy, Sabita indra reddy Dharmana

 

 

మీడియాతో మాట్లాడిన విషయాలపై దాఖలు చేసిన మెమోపై మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి వ్యక్తం చేసిన అభ్యంతరాలను సిబిఐ వ్యతిరేకించింది. వారిద్దరు మంత్రులుగా పనిచేశారని, రాజకీ యంగాను, అధికార వర్గాల్లోనూ పలుకుబడి కలవారని ఈ నేపథ్యంలో వారు మాట్లాడిన మాటలు సాక్షుల్ని ప్రభావితం చేస్తాయన్న తన ఆందోళనను పునరుద్ఘాటించింది. ఈ వ్యవహారంలో నింధుతులుగా వీరిద్దరిని జ్యుడిషియల్ కస్టడీకి తీసుకోవాలని, నేరం రుజువైతే శిక్ష అనుభవించక తప్పదని పేర్కొంది.


సీబీఐ దాఖలు చేసిన మెమోను కొట్టేయాలని కోర్టును మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితాకోరారు. ప్రజాప్రతినిధులుగా తాము ఎందుకు రాజీనామా చేశామో చెప్పాల్సిన బాధ్యత త మపై ఉందని అందుకే మీడియాతో మాట్లాడామని చెప్పారు. దానిపై సీబీఐ అర్థం లేని వాదనలను లేవనెత్తిందని ఆక్షేపిం చారు. దీనిపై వాదనలను కోర్టు 19వ తేదీకి వాయిదా వేసింది. మొత్తానికి ఈ వ్యవహారంలో సబిత, ధర్మానలకు జైలు జీవితం తప్పేలా కనబడటం లేదు.