జగన్ అక్రమాస్తుల కేసు విచారణ మళ్లీ వాయిదా!!

posted on: Feb 28, 2020 11:31AM

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ అక్రమాస్తుల ఆరోపణల కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసుకు సంబంధించి ప్రతి శుక్రవారం హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. వైఎస్ జగన్‌తోపాటు పలువురు ప్రముఖులు ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. కాగా, ఈరోజు కోర్టులో జరిగిన విచారణకు తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులు హాజరయ్యారు. విచారణ సందర్భంగా జగన్ దాఖలు చేసిన అబ్సెంట్ పిటిషన్‌ కు కోర్టు అనుమతించింది. తదుపరి విచారణను మార్చి 6వ తేదీకి వాయిదా వేసింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...