Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఏబీవీ సస్పెన్షన్ ను కొట్టేసిన క్యాట్!
posted on: May 8, 2024 4:41PM
సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను క్యాట్ కొట్టేసింది. తనను రెండో సారి జగన్ సర్కార్ సస్పెండ్ చేయాడాన్ని ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ లో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఏబీవీ పిటిషన్ పై వాదనలు పూర్తై తీర్పు రిజర్వ్ చేసిన క్యాట్ ఆ తీర్పును రిజర్వ్ చేసింది. ఏబీ వెంకటేశ్వరరావును రెండో సారి సస్పెండ్ చేయడం న్యాయ విరుద్ధమని క్యాట్ స్పష్టం చేసింది. ఆయనను తక్షణమే సర్వీసులోనికి తీసుకుని ఏరియర్స్ మొత్తం చెల్లించాలని ఆదేశించింది. ఏబీవెంకటేశ్వరరావు సస్పెన్షన్ చట్ట విరుద్ధమని దేశ సర్వెన్నత న్యాయస్థానం విస్పష్ట తీర్పు ఇచ్చిన తరువాత కూడా ఆయన రెండో సారి సస్పెండ్ చేయడం వేధింపుల కిందకే వస్తుందని క్యాట్ తన తీర్పులో పేర్కొంది.
నిఘా పరికరాల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ రావుపై ఏసీబీ కేసు నమోదు చేయడంతో న్యాయ వివాదం మొదలైంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. తన సస్పెన్షన్ ను ఏబీవీ క్యాట్ లో సవాల్ చేశారు. అయితే అప్పట్లో క్యాట్ ఏబీవీ సస్పెన్షన్ ను సమర్ధించింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు క్యాట్ నిర్ణయాన్ని కొట్టివేసింది. ఆయనను విధుల్లోకి తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు తీర్పును జగన్ సర్కార్ సుప్రీం కోర్టులో సవాల్ చేయగా, సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ తీర్పు వెలువరించింది.
దీంతో సుప్రీం కోర్టు ఆదేశానుసారం రాష్ట్రప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ ను ఎత్తివేసి విధుల్లోకి తీసుకుంది. అయితే ఇలా విధుల్లోకి తీసుకున్నట్లే తీసుకుని మళ్లీ పాత ఆరోపణలతో రెండో సారి సస్పెండ్ చేసింది. ఒకే ఆరోపణలపై రెండో సారి సస్పెండ్ చేయడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ ఏబీవీ క్యాట్ ను ఆశ్రయించారు. క్యాట్ ఆయన సస్పెన్షన్ ఎత్తివేసింది.



.webp)


