Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎమ్మెల్యే రేవంత్ మీద కేసు
posted on: Oct 21, 2014 7:22PM

తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ఆశ్రిత పక్షపాత ధోరణితో తమ బంధువులకు ప్రభుత్వ భూములను కట్టబెడుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక న్యాయవాది రేవంత్ రెడ్డి మీద నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్ మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మీద కేసు నమోదైంది. బంజారాహిల్స్ పోలీసులు రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు.






