TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నిర్మలమ్మపై కేసు!

Published on: Sat Sep 28, 2024 1:46PM

కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు అయ్యింది. చట్ట సభ ప్రతినిథుల న్యాయస్థానం ఆదేశాల మేరకు బెంగళూరు తిలక్ నగన్ పోలీసులు నిర్మలా సీతారామన్ పై ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు.  ఎన్నికల బాండ్ల పేరుతో పారిశ్రామికవేత్తలను బెదిరించి వారి నుంచి బీజేపీకి నిధులు వచ్చేలా చేశారంటూ జనాధికార సంఘర్ష పరిషత్ కు చెందిన ఆదర్శ్ అయ్యర్   పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి సంతోష్ గజానన హెగ్డే.. నిర్మలపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. తదుపరి విచారణను వచ్చే నెల 10కి వాయిదా వేశారు. కోర్టు ఆదేశాలతో నిర్మలా సీతారామన్, ఇతరులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.