గూగుల్ మీద కేసు

 

 

 

ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగదారులకు విశేష సేవలు అందిస్తూ, ఇంటర్నెట్ ప్రకటనల రంగంలో కూడా అగ్రస్థానంలో వున్న గూగుల్ మీద కేసు నమోదైంది. ఇంటర్నెట్ సెర్చింగ్ రంగంలో, మొబైల్ సెర్చ్ రంగంలో గూగుల్ ఆక్రమంగా ఆధిపత్యాన్ని కొనసాగిస్తోందని కేసు నమోదైంది. ఆండ్రాయిడ్ మొబైల్స్ లో ముందుగానే యాప్ప్ లోడ్ చేయడం ద్వారా అనేక మోబైల్స్ లో తనకు సంబంధించిన గూగుల్, యూ ట్యూబ్ లాంటి వెబ్ సైట్లకి ప్రాధాన్యం వుండేలా గూగుల్ చూసుకుంటుందనేది ఈ కేసు సారాంశం. ఇలా చేయడం మొబైల్ అప్లికేషన్ డిస్ట్రిబ్యూషన్ ఒప్పందాలకు వ్యతిరేకమని ఆ కేసులో పేర్కొన్నారు. నార్త్ కాలిఫోర్నియాలోని డిస్ట్రిక్ట్ కోర్టులో ఈ కేసు నమోదైంది. నోకియా వ్యాపార ప్రత్యర్థులు ఈ కేసు పెట్టారు.