Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కడపలోనూ కరోనా కలకలం
posted on: May 23, 2025 1:08PM

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మళ్లీ కోరలు చాస్తున్నది. 2019 నుంచి 2021 మూడు దశలలో కరోనా మహమ్మరి ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఉసురు తీసింది. జనం నెలల తరబడి కరోనా కర్ఫ్యూ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు. మాస్కు లేకుండా అడుగు బయటపెట్టలేని పరిస్థితి ఎదుర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ మరో సారి కరోనా విజృంభిస్తోందన్న వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ధాయ్ ల్యాండ్ సింగపూర్ లలో కరోనా వ్యాప్తి తీవ్రత అధికంగా ఉందన్న వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నా.. మన వరకూ రాదులే అని అంతా భావించారు. అయితే కొన్ని రోజుల కిందట కేరళలో కరోనా కేసులు పెరుగుతున్నాయన్ని వార్తలు ఒకింత ఆందోళన కలిగించాయి. ఆ తరువాత ఏపీలోనూ తొలి కరోనా కేసు విశాఖలో వెలుగు చూసింది. ఒక వివాహితకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆ తరువాత ఆమె భర్తా, కుమారుడూ కూడా పాజిటివ్ అని తేలింది. వారిని హౌస్ ఐసోలేషన్ లో ఉంచారు. తాజాగా కడపలో కూడా కరోనా కేసు వెలుగులోకి వచ్చింది. నంద్యాల చాగలమర్రికి చెందిన ఒక వృద్ధురాలు తీవర జ్వరంలో కడప రిమ్స్ కు రాగా, ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది.
దీంతో ఆమెకు ప్రత్యేక వార్డులో చికిత్స చేస్తున్నారు. జిల్లాయంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. కడపలో కరోనా కేసు నమోదు కావడంతో తెలుగుదేశం పార్టీ కూడా అప్రమత్తమైంది. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు కడపలో పార్టీ పండుగ మహానాడు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తెలుగుదేశం శ్రేణులు కరోనా ప్రికాషన్స్ తీసుకోవడమే కాకుండా, పట్టణంలో కూడా కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. శానిటైజర్స్, మాస్కులు సిద్ధం చేయడమే కాకుండా.. లక్షలాదిగా తరలివచ్చే ఈ కార్యక్రమంలో కరోనా వ్యాప్తికి అవకాశం లేకుండా మహానాడు ప్రాంగణంలో కూడా అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు.






