Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టిఫిన్ చేయడానికి కారులో వెళ్లి.. హుస్సేన్ సాగర్లోకి..
posted on: Nov 28, 2021 8:29AM
వాళ్లు ముగ్గురు స్నేహితులు. ఎప్పుడూ కలిసే ఉంటారు. వాళ్లలో ఒకరు నాలుగు రోజుల క్రితం కారు కొన్నాడు. దీంతో మూడు రోజుల నుంచి ముగ్గురు స్నేహితులు కొత్త కారులో షికారు చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే శనివారం రాత్రంతా కారులో హైదరాబాద్ తిరిగారు. తెల్లవారుజామున టిఫిన్ చేసేందుకు బయలుదేరారు. అయితే కారు అదుపు తప్పింది. హుస్సేన్ సాగర్ లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ముగ్గురు స్నేహితులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ పార్కు వద్ద ఆదివారం తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది . అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఎన్టీఆర్ పార్క్ ఎదుట హుస్సేన్సాగర్లోకి దూసుకెళ్లింది .దీంతో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది . అందులో ఉన్న ముగ్గురు యువకులకు స్వల్ప గాయాలయ్యాయి . సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు . కారులో ఉన్న యువకులను బయటకుతీసి .. యశోద దవాఖానకు తరలించారు.
ఈ కారు ప్రమాద ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. యువకులను ఖైరతాబాద్ కు చెందిన నితిన్ , స్పత్రిక్ , కార్తీక్ గుర్తించారు . కారును నాలుగు రోజుల క్రితమే తీసుకున్నారని , ఖైరతాబాద్ నుంచి అఫ్జల్ గంజ్ లో టిఫిన్ చేయడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.


.jpg)
.jpg)


