Latest News
మోహన్‌బాబుకి ప్రమాదం.. ఏం కాలేదు..
posted on: Oct 9, 2014 5:23PM
.jpg)
ప్రముఖ నటుడు, నిర్మాత ‘కలెక్షన్ కింగ్’ మోహన్‌బాబు ప్రయాణిస్తున్న కారును హైదరాబాద్‌లోని రద్దీగా వుండే మాదాపూర్‌లో మరో క్యాబ్ కారు ఢీకొనడంతో మోహన్ బాబు ప్రయాణిస్తున్న కారు తీవ్రంగా ధ్వంసమైంది. ఈ ప్రమాదం నుంచి మోహన్‌బాబు ఎలాంటి గాయాలూ లేకుండా క్షేమంగా బయటపడ్డారు. మోహన్‌బాబుకు ఎంతమాత్రం గాయాలు తగలలేదు. మోహన్‌బాబు తన కార్యాలయం నుంచి ఇంటికి వెళ్తూ వుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ కారు ప్రమాదం కారణంగా మాదాపూర్ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. గతంలో కూడా మాదాపూర్ ప్రాంతంలోనే నటుడు ప్రకాష్ రాజ్ కారుకు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం మీద మోహన్‌బాబు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.



.jpg)


