ఎప్పుడూ వాళ్లేనా..

 

 

 

 

ప్రతి సారి లాగే ఈ ఏడు కూడా కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఘనంగా ప్రారంభమైంది.. భారీ సెట్టింగ్‌లు మిరుమిట్లు గొలిపే విద్యుత్‌ దీప కాంతులు.. హాలీవుడ్‌ స్టార్ల తళుకులతో రెడ్‌కార్పెట్‌ మరింత అందంగా ముస్తాబయింది.. కాని ప్రపంచ సినిమా తరుపున జరిగే వెండితెర పండుగలో పాల్గొనే భారతీయ ప్రముఖుల సంఖ్య మాత్రం ఎప్పుడు తక్కువే..

 

  ముఖ్యంగా ఆకట్టుకునే అందం తోపాటు భారీ స్టార్‌ ఫాలోయింగ్‌ ఉన్న ఒకరు ఇద్దరు ఆర్టిస్ట్లు తప్ప నటులుగా అత్యున్నత శిఖరాలను అధిరోహించిన భారతీయులకు ఇలాంటి వేడుకల నుంచి పిలుపు రాకపోవడం బాధాకరం..

 

 ఇండియన్‌ సినిమా నుంచి అమితాబ్‌ లాంటి వాళ్లు అతి ఎక్కువ సార్లు కేన్స్‌ వేధిక మీద మెరవగా విశ్వసుందరి ఐశ్వర్య కూడా అంతర్జాతీయ వేదికల మీద బాగానే కనిపించింది.. వీళ్లతో పాటు అందాల ఆరబోతతో గుర్తింపు పొందిన మల్లికా షెరావత్‌ లాంటి వాళ్లు కూడా ఇలాంటి స్టేజ్‌ల మీద అలరించారు..



        కాని భారతీయ సినిమాకు అవార్డుల పంట పండిచిన కమల్‌హాసన్‌, మమ్ముటి, మోహన్‌లాల్‌, ఓంపురి లాంటి అరుదైన అద్భుతమైన నటులకు ఇలాంటి వేడుకలకు ఆహ్వానాలు అందంటం చాలా అరుదు.



        బాలీవుడ్‌ నటులు హాలీవుడ్‌కు కాస్త చేరువగా ఉండటంతో పాటు బాలీవుడ్‌ సినిమాలకు విదేశాల్లో కూడా మంచి ఆదరణ ఉండటంతో అక్కడి నటులకు మాత్రమే హాలీవుడ్‌ నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి.. సౌత్‌ స్టార్‌లు ఎంత గొప్ప వారయినా అంతర్జాతీయ వేదికల మీద తళుక్కుమనే అర్హత మాత్రం సాదించలేక పోతున్నారు..


        ఇవి ఏ నటుల ప్రతిభకు కొలమానాలు కాకపోయినా వాళ్ల అభిమానులు మాత్రం అలా అంతర్జాతీయ వేదికల మీద తన అభిమాన నటులు కూడా పాలుపంచుకుంటే చూసుకోవాలని కోరుకుంటున్నారు




 

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu