వరల్డ్ కాన్సర్ డే

ఒకప్పుడు కాన్సర్ అనే పేరు వినగానే జీవితంపై ఆశలు కోల్పోయేవారు. కాని ఇప్పుడు ఇది కూడా అన్ని వ్యాధులలాగే కామన్ వ్యాధిగా మారిపోయింది. బ్లడ్ కాన్సర్  ని సైతం తగ్గించి తిరిగి మనిషికి ప్రాణం పోస్తున్నారు డాక్టర్లు. కాని కాన్సర్ వచ్చాకా చికిత్స చేయించుకోవటం కన్నా అసలు రాకుండా ముందుగానే నివారణా పద్దతులు పాటించటం మంచిది అంటున్నారు నిపుణులు.

2016 నుండి 2018 ఈ మూడేళ్ళ వ్యవధిని we can i can అనే థీమ్  ని ఆధారంగా చేసుకుని అందరు సంయుక్తంగా లేదా వ్యక్తిగతంగా కాన్సర్ పై పోరాడి దాని ఉనికిని సైతం అరికట్టాలని కంకణం కట్టుకున్నాయి ప్రపంచ దేశాలు.

మన జీవనశైలిలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే చాలు కాన్సర్ రాకుండా నివారించుకోవచ్చు. యుక్త వయసులో ఉన్నప్పుడు ఆడవారు ఎక్కువగా పీచు పదార్ధం ఉన్న కూరలు, పళ్ళు తినటం వల్ల వయసు పెరిగాకా వచ్చే బ్రెస్ట్ కాన్సర్ ని నివారించుకోవచ్చు అని తేల్చి చెప్పింది ఒక అధ్యయనం.

అధిక బరువుతో  బాధపడేవారిలో intestain కాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తినే పదార్థాలలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటూ సరైన వ్యాయామాల ద్వారా బరువు తగ్గించుకునే ప్రయత్నం చెయ్యాలి. గొంతు,నోటి కాన్సర్ వచ్చేవారిలో మద్యపానం అలవాటు ఎక్కువగా ఉన్నవారే ఉన్నారు.

కాన్సర్ ని నివారించటమే కాదు అది మన దగ్గరకి కూడా రాకుండా ఉంచటం కూడా మన చేతుల్లో ఉన్న పనే. మనం రోజు ఇంట్లో ఉపయోగించే పండ్లు,కూరగాయలు వాడే ముందు వాటిని వేడి నీటిలో బాగా కడిగి ఉపయోగించాలి. మనకి తెలియక మనం చేసే మరో పొరపాటు బట్టలని డ్రైవాష్ కి వెయ్యటం. ఎందుకంటే డ్రై క్లీనింగ్ చెయ్యటానికి ఉపయోగించే పర్క్రోరో ఎథిలీన్ అనే రసాయనం కాన్సర్ రావటానికి కారణం అంటున్నారు వైద్య నిపుణులు. అంతేకాదు ప్లాస్టిక్ సీసాల్లో నిల్వ చేసే నీరు వాడటం కన్నా గాజు లేదా స్టీల్ కంటైనర్ లలో ఉండే నీరు తాగటం వల్ల  కాన్సర్ మన దగ్గరకి రాకుండా జాగ్రత్త  పడవచ్చు. ఈ రోజుల్లో ఉద్యోగస్తులు తమ హడావిడి జీవనంలో నీళ్ళు త్రాగటానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇవ్వలేకపోతున్నారు,కాని రోజు తగినంత నీరు తీసుకుంటూ ఉండాలి. టీ అలవాటు ఉన్నవారు మాములు టీ త్రాగే బదులు గ్రీన్ టీ తాగటం ఉత్తమం. కాఫీ లో కూడా కాన్సర్ ని అడ్డుకునే గుణం ఉండటం వల్ల రోజులో ఒక్కసారైనా కాఫీ తాగాలి.

అన్నిటికన్నా కాన్సర్ అనే మాట వినగానే అదొక ప్రాణాలు తీసే వ్యాధిగా దానిని చూడకుండా మన మనోధైర్యంతో దానిని జయించగలిగే ఆత్మస్థైర్యాన్ని మనలో నింపుకోవటం ఎంతో అవసరం.

కళ్యాణి