TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సెలవులు రద్దు చేసుకుంటున్నా.. గౌతమ్ సవాంగ్

Published on: Wed Dec 16, 2015 11:13AM

విజయవాడలో కాల్ మనీ రగడ సమయంలో సీపీ గౌతమ్ సవాంగ్ సెలవులు కోరడంపై అనేక అనుమానాలు వ్యక్తమయిన సంగతి తెలిసిందే. కాల్ మనీ వ్యాపారుల నుంచి రాజకీయంగా వస్తున్న ఒత్తిళ్లే కారణమని.. అందుకే తాను సెలవులు తీసుకున్నారని పలువురు విమర్శించారు. దానికి గౌతమ్ సవాంగ్ నెలరోజుల క్రితమే సెలవులు కావాలని కోరారని.. కాల్ మనీ దీనికి సంబంధం లేదని డీజీపీ రాముడు కూడా స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు గౌతమ్ సవాంగ్ కూడా ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన కాల్ మనీ కేసు దృష్ట్యా సెలవులు రద్దు చేయాలని డీజీపీని కోరానని..నేను సెలవులు రద్దు చేసుకుంటున్నానని తెలిపారు.ఇంకా కాల్ మనీ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది..రాష్ట్రవ్యాప్తంగా పలు ఫైనాన్స్ కార్యలయాలపై దాడులు చేస్తున్నాం.. పలువురిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టామని గౌతమ్ సవాంగ్ తెలిపారు