వైద్య విధాన పరిషత్ పేరు మారుస్తూ కేబినెట్ నిర్ణయం

posted on: Feb 23, 2026 7:40PM

 

సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయలు తీసుకున్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్  మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా పేరు మారుస్తు డెసిషన్ తీసుకున్నారు. దీంతో ఇక నుంచి టీవీవీపీ ఉద్యోగులంతా ప్రభుత్వ పరిధిలోకి రాబోతున్నారు. హైదరాబాద్ మెట్రోను ఎల్ & టీ నుంచి స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఖమ్మం అర్బన్ లో టీటీడీకి 20 ఎకరాల భూమి కేటాయించినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు ప్రతి జిల్లాల్లో భూ కేటాయింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నియోపోలీస్ లో నీటి సరఫరాకు HMWS బడ్జెట్ కేటాయింపు..JNTU కాలేజి నిర్మాణానికి మహబూబాబాద్ జిల్లా  గుమ్మడూరులో 70 ఎకరాల కేటాయింపుకు పచ్చజెండా ఊపారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జనగణన  2027ను చేపట్టేందుకు రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లపై మంత్రివర్గం చర్చించింది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం తొలి విడత జరిగే ఇండ్ల గణన (హౌజ్ లిస్టింగ్ ఆపరేషన్) రాష్ట్రంలో మే 11వ తేదీన ప్రారంభించి జూన్ 9 వరకు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు తెలిపారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...