Latest News

5జీ స్పెక్ట్ర‌మ్ వేలానికి కేంద్ర కేబినెట్ పచ్చ జెండా

posted on: Jun 16, 2022 8:15AM

దేశంలో ఇక త్వ‌ర‌లోనే 5జి సేవ‌లు అందుబాటులోకి రానున్నాయి. బుధ‌వారం జ‌రిగిన కేబినెట్ స‌మా వేశంలో 5జీ స్పెక్ట్ర‌మ్ వేలానికి అనుమ‌తిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఇర‌వ‌య్యేళ్ల చెల్లుబాటు కాల ప‌రిమితి తో  72 గిగాహెర్ట్జ్ స్పెక్ట్ర‌మ్ ను జూలై నెలాఖ‌రునాటికి  వేలం వేయ‌డానికి  ప్ర‌ధాని  మోదీ  నేతృత్వంలో జ‌రిగిన కేబినెట్ నిర్ణ‌యించింది. ఇది 4జీ కంటే ప‌ది రెట్ల వేగంతో ప‌ని చేస్తుంది. 

5జీ వేలానికి కేంద్ర కేబినెట్ ఆమెదం తెలిపిన‌ట్టు బుధ‌వారం ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న తెలి పింది. ప్ర‌భుత్వం డిజిట్ ఇండియా, స్టార్ట‌ప్ ఇండియా,మేక్ ఇన్ ఇండియా వంటి విధాన‌ప‌ర‌మైన నిర్ణయా ల‌ను అమ‌లుచేస్తున్న నేప‌థ్యంలో డిజిట‌ల్ అనుసంధానం కీల‌కంగా మారింది. 5జి టెక్నాలజీ ఆధారిత సేవలను అందజేయడం కోసం మిడ్, హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు  ఉప యోగించుకుంటారని ఆశిస్తున్నట్లు ప్రభుత్వ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుత 4G  సర్వీసుల  ద్వారా సాధ్యమవుతున్న దాని కన్నా 10 రెట్లు ఎక్కువ వేగం, సామర్థ్యంతో సేవలందించడానికి  ఉపయోగించు కోవ‌చ్చు.

ఈ రోజుల్లో మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ అంత‌ర్భాగంగా మారిపోయింద‌ని, 2015 నుంచి దేశ‌వ్యాప్తంగా  4జీ సేవ ల‌ను అత్యంత వేగంగా విస్త‌రించ‌డంతో దీని ప్రాధాన్య‌త పెరిగింద‌ని తెలిపారు. 2014లో ప‌ది కోట్ల మంది బ్రాడ్‌బ్యాండ్ స‌బ్‌స్కై్ర‌బ‌ర్లు వుంటే, ప్ర‌స్తుతం ఆ సంఖ్య 80 కోట్ల‌కు పెరిగింద‌ని తెలిపారు. అయితే  ప్ర‌స్తు త్వం ఈ నిర్ణ‌యంతో ఇప్ప‌టి వ్యాపారాలు, వ్యాపార‌స్తుల‌కు ఎంతో ల‌బ్ది చేకూరవ‌చ్చు.  కొత్త వ్యాపార సంస్థ లు కూడా అద‌న‌పు ఆదాయాన్ని పొంద‌డానికి  ప్ర‌బుత్వం నిర్ణ‌యం ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అం టున్నారు. 

ప్ర‌భుత్వం గ‌త సెప్టెంబ‌ర్‌లో ప్ర‌క‌టించిన టెలికాం రంగ సంస్క‌ర‌ణ‌లు ఈ వేలానికి ఉపయోగ‌ప‌డ‌తాయ‌ని భావిస్తున్నారు. ఆటోమోటివ్, హెల్త్‌కేర్, వ్యవసాయం, ఇంధనం తదితర రంగాల్లో  యంత్రం నుంచి యం త్రానికి కమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కృత్రిమ మేధాశక్తి వంటి ఇండస్ట్రీ 4.0 అప్లికేషన్ లో  స‌రికొత్త  కల్పనల ప్రభంజనం పుంజుకుంటుందని ప్రభుత్వం ఆశిస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...