TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బస్సు ప్రమాదం.. ఏడుగురి మృతి

Published on: Tue Apr 7, 2015 10:28AM

 

చైనాలో యునాన్ ప్రావెన్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడి ఏడుగురు మృతి చెందగా, మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. 36 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు రోడ్డు పక్కన రక్షణగా పెట్టిన బ్యారికేడ్స్ ని ఢీ కొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా మిగిలిన నలుగురు ఆస్సత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు. గాయపడిన వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.