TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమ్మగారేం చెబ్తే అది చేస్తాం!

Published on: Sat Sep 29, 2012 7:58AM

Bus Charges Hike, Election Manifesto, Transport Minister Botsa Satyanarayana, Subsidy Gas Cylinders Increase, Orders Not Received, Sonia Gandhi, High Command

 

బస్సు ఛార్జీలు పెంచబోమంటూ పార్టీ ఎన్నికల ప్రణాళికలో తాము పేర్కొనలేదని రాష్ట్ర రవాణాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ చెబ్తున్నారు. అలాగే సామాన్యుల కోసమే తాము ఆర్టీసీ ఛార్జీలు పెంచామని కూడా ఆయన హస్తినాపురంలో స్పష్టం చేస్తున్నారు. అలాగే రాయితీ వంటగ్యాస్‌ సిలిండర్లు ఆరు నుండి తొమ్మిదికి పెంచాలంటూ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ జారీచేసిన ఆదేశాలు తమకు ఇంకా అందలేదనీ, పార్టీ ఏది చెబితే అది తాము అమలు చేస్తామంటూ ఆయన అధిష్టానంపట్ల అపారమైన విధేయత వ్యక్తం చేసేశారు. మంత్రిఅంటే బొత్సగారిలాగానే ఉండాలి. ఛార్జీలను ఎంతో దయతో సామాన్యుల మేలుకోసం పెంచారు. అదేమంటే ఛార్జీలు పెంచబోమని మా పార్టీ ఎన్నికల ప్రణాళికలో లేదన్నారు. హరిశ్చంద్రునికి మంత్రిగారికి తడికే అడ్డం. ‘ఎన్నికల ప్రణాళికలో ఏదివుంటే అదేచేస్తాం’ అన్నారు. ఆ లెక్కన ఆయన తమ పార్టీ ఎన్నికల ప్రణాళికల్లో వున్నవన్నీ ఇప్పటివరకు చేయించారా?ఆలోచించుకోవలసివుంది. అధికారం చేతుల్లో వుంది, అధిష్టానం అండ వుంది, ఇంకేం కావాలి... ఏమైనా చెబుతారు. తప్పదు భరించాల్సిందే... అంటున్నారు జనం...!