మరో ఘోరం

posted on: Nov 14, 2013 7:12AM

 

మహబూబ్నగర్ జిల్లాలో వోల్వో బస్సు ప్రమాదం మరువక ముందే కర్ణాటకలో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి ముంబై వెళుతున్న నేషనల్ ట్రావెల్కు చెందిన వోల్వో బస్సు ఈ తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో హవేలీ జిల్లాలోని కునిమల్లళ్లిలో మంటల్లో చిక్కుకుంది.ఈ దుర్ఘటనలో ఏడుగురు మరణించగా, చాలా మంది గాయపడ్డారు. గాయపడ్డవారిలో కొందరి పరిస్థితి విషయంగా ఉంది.

బుధవారం సాయంత్రం బెంగళూరు నుంచి ముంబైకి ఈ బస్సు బయలుదేరింది. అయితే ప్రమాదానికి కారణం డ్రైవర్‌ నిర్లక్షంగా భావిస్తున్నారు. బస్సు డివైడర్‌ను డీకోని టైరుపేలటంతో మంటలు వ్యాపించాయన్నది ప్రాదమిక సమాచారం.ప్రమాద సమయంలో బస్సులో 49 మంది ప్రయాణికులున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...