Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సిట్ కార్యాలయంలో పత్రాలు దహనం
posted on: Apr 8, 2024 3:00PM
భారతీయ న్యాయ వ్యవస్థ ముఖ్యంగా మూడు రకాల చట్టాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి ఐపిసి, రెండోది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, మూడోది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ . ఇందులో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అత్యంత కీలకమైంది. ఒక వ్యక్తి నేరం చేస్తే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం శిక్షలు పడతాయి. ఎవిడెన్స్ ను బేస్ చేసుకుని శిక్షలు వేస్తాయి కోర్టులు. . మే 13న ఎపిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ వెలిబుచ్చిన అభిప్రాయం ప్రకారం వైఎస్ఆర్ సిపి మళ్లీ గెలుపొందడం కష్టమే.. ఎన్డీఏ కూటమి గెలుపు ఖాయమని పక్కాగా తేలడంతో ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల ప్రకారం అధికారులు వివిధ అక్రమ కేసుల్లో సాక్ష్యం లేకుండా చేసే కుట్రకు తెరలేపారు. జూన్ నాలుగు తర్వాత జగన్ ప్రభుత్వం కూలిపోతే అధికారంలో వచ్చే తెలుగుదేశం ప్రభుత్వానికి సాక్ష్యాలు దొర కకుండా తప్పించుకునే ఉపాయమే పత్రాల దహనం కుట్ర అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
తాడేపల్లి సిట్ కార్యాలయం కాంపౌండ్‌లో పలు డాక్యుమెంట్లను అక్కడి సిబ్బంది దహనం చేయడం కలకలంరేపుతోంది. ఈ ఘటనపై టీడీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ డాక్యుమెంట్లను వీటిని తగలబెట్టడాన్ని పలువురు స్థానికులు ప్రశ్నించడంతో పాటు వీడియోలు తీశారని చెబుతున్నారు. ఆ వీడియోలను తమకు ఇవ్వాలని స్థానికులపై సీఐడీ ఒత్తిడి తెస్తున్నట్లు టీడీపీ ఆరోపిస్తోంది. సిట్ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు పత్రాలు తగలబెట్టినట్లు సిబ్బంది చెబుతున్నట్లు టీడీపీ ఆరోపిస్తోంది. హెరిటేజ్ సంస్థ కీలక పత్రాలు సహా ఇతర పత్రాలు అందులో ఉన్నట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
సిట్ కార్యాలయంలో పత్రాల దహనంపై సమాధానం చెప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రశ్నించారు. బ్రాహ్మణి, భువనేశ్వరి ఐటీ రిటర్న్స్‌లు ఎలా వచ్చాయో చెప్పాలని.. లోకేశ్‌ను విచారణ సమయంలో ప్రశ్నించిన పత్రాలపై ఆనాడే అడిగామన్నారు. ఆ పత్రాలు ఎలా వచ్చాయో ఇంతవరకు సమాధానం చెప్పలేదన్నారు. ఎవరి ఉత్తర్వులతో పత్రాలు తగలబెట్టారో డీజీపీ చెప్పాలని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే పత్రాల దహనం చేశారని.. తప్పుడు పనులు చేసిన అధికారులను వదిలేది లేదన్నారు.
ఃఅమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో హెరిటేజ్ సంస్థపై కూడా ఆరోపణలు వచ్చాయి. తాజా ఘటనలో సిట్ ఆఫీస్ దగ్గర కాల్చేసిన డాక్యుమెంట్లు హెరిటేజ్ సంస్థవని అనుమానాలు వ్యక్తం కావడంతో.. ఈ డాక్యుమెంట్లకు ఆ కేసుతో లింక్ ఉందని టీడీపీ చెబుతోంది. ఈ కేసులో నారా లోకేష్‌ను కూడా సీఐడీ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తాజాగా హెరిటేజ్‌కు సంబంధించిన పత్రాలు తగులబెట్టే సమయంలో వీడియోలు తీయడంతో ఈ ఘటన బయటపడింది. అయితే ఈ అంశంపై సిట్ అధికారులు స్పందించాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



.webp)


