TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, ఆశలను సాకారం చేసే రూట్ మ్యాప్ బడ్జెట్.. పయ్యావుల

Published on: Sat Feb 14, 2026 10:53AM

తన బడ్జెట్ ప్రసంగంలో వరుసగా మూడో సారి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం దక్కడం తన అదృష్టమన్న మంత్రి పయ్యావుల కేశవ్.. బడ్జెట్ అంటే కేవలం ఆదాయ, వ్యయాల పద్దు మాత్రమే కాదన్నారు. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడానికి బడ్జెట్ ఒక రోడ్ మ్యాప్ అని అభివర్ణించారు.  రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేసేలా బడ్జెట్ ను రూపొందించినట్లు చెప్పిన పయ్యావుల కేశవ్.. పాలన ఎలా ఉండకూడదో గత జగన్ ప్రభుత్వం నిరూపించిందనీ, పాలన ఎలా ఉండాలో చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చూపుతోందనీ చెప్పారు.

గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దేలా గత బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు చెప్పిన పయ్యావుల కేశవ్.. ప్రస్తుత బడ్జెట్ ను స్వర్ణాంధ్ర విజన్ కు బాటలు వేసేలా రూపొందించినట్లు వివరించారు.   ఇప్పటి వరకు సాధించిన .. ఇంకా ఏం సాధించాల్సిన అంశాల ఆధారంగా బడ్జెట్  రూపొందించినట్లు చెప్పిన విత్త మంత్రి,  ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అందుకు అనుగుణంగానే బడ్జెట్ ఉంటుందన్నారు.  సంక్షేమం కేవలం కాగితాలకు   క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్లాలన్న లక్ష్యంతో బడ్జెట్ రూపొందించినట్లు చెప్పారు.