కన్నతండ్రినే దారుణంగా హత్య చేశాడు.. ఎందుకో తెలిస్తే షాకే!
posted on: Feb 24, 2026 8:40AM
.webp)
కన్న తండ్రినే కర్కసంగా హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలు, ముక్కలుగా కోసి ఇంట్లోనే ఓ డ్రమ్ములో దాచేసిన కొడుకు ఉదంతమింది. ఇంతకీ తండ్రిని అంత దారుణంగా హత్య చేయడానికి కారణమేంటంటే.. నీట్ పరీక్షకు సిద్ధం కావాలని ఆ తండ్రి ఒత్తిడి చేయడమే. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో జరిగింది. తండ్రి తనను నీట్ పరీక్షకు సిద్ధం కావాలికి పదేపదే చెబుతుండటాన్ని ఆ కొడుకు సహించలేకపోయాడు. తుపాకితో తండ్రిని కాల్చి చంపడమే కాకుండా, మృతదేహాన్ని ముక్కలు చేసి ఇంట్లోని డ్రమ్ములో దాచిపెట్టాడు. ఈ దారుణాన్ని చూసిన చెల్లిని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదరించి నోరుమూయించాడు.
లక్నోలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. నీట్ పరీక్షకు సిద్ధం కావాలని తండ్రి పదేపదే ఒత్తిడి చేయడంతో ఆగ్రహానికి గురైన ఓ కొడుకు.. అతడిని కాల్చి చంపాడు. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని ముక్కలుగా నరికి, ఇంట్లోని డ్రమ్ములో దాచిపెట్టాడు. చెల్లి కళ్లెదుటే ఈ ఘోరానికి పాల్పడి, విషయం బయటపెడితే చంపేస్తానని ఆమెను బెదిరించడం గమనార్హం.
లక్నోలోని వర్ధమాన్ పాథాలజీ యజమాని మాన్వేంద్ర ప్రతాప్ సింగ్ (49), ఈ నెల 20 నుంచి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు మాన్వేంద్ర కుమారుడు 19 ఏళ్ల అక్షత్ ప్రతాప్ సింగ్ ప్రవర్తనపై అనుమానం వచ్చింది. విచారణలో అతను పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో పోలీసులు గట్టిగా ప్రశ్నించారు. దీంతో అతడు తానే హత్య చేసినట్లు అంగీకరించాడు.
మృతదేహాన్ని మూడో అంతస్తు నుంచి కిందికి తెచ్చి, ఆధారాలను నాశనం చేసేందుకు ముక్కలుగా నరికాడు. కొన్ని శరీర భాగాలను సదరోనా గ్రామం సమీపంలో పడేసి, మిగిలిన భాగాలను ఇంట్లోని ఓ డ్రమ్ములో దాచిపెట్టినట్లు వెల్లడించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డ్రమ్ములో ఉన్న మృతదేహం భాగాలను స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ బృందం ఆధారాలు సేకరించింది. నిందితుడు అక్షత్‌ను అదుపులోకి తీసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.




.webp)


