Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బిఆర్ఎస్ కు షాక్ ... మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ రాజీనామా
posted on: Mar 20, 2024 6:14PM
ఇంట గెలిచి రచ్చ గెలవాలనుకున్న బిఆర్ఎస్ అధినేత బొక్కబోర్లా పడ్డట్టయ్యింది. కేంద్రంలో చక్రం తిప్పాలనుకున్నకెసీఆర్ వరుసగా హ్యాట్రిక్ కొట్టాలనుకుని ఘోర పరాజయం పొందారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితురాలైన కవితను అరెస్ట్ కాకుండా కాపాటంలో కెసీఆర్ విఫలం కావడంతో బిఆర్ఎస్ నుంచి జంప్ జిలానీలు పెరిగిపోయారు.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన శాసన మండలి మాజీ సభ్యుడు పురాణం సతీష్ కుమార్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన పార్టీ అధినేతకు తన రాజీనామా లేఖను పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాను త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. తెలంగాణ పేరుతో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిని బీఆర్ఎస్‌గా మార్చి తప్పు చేశారన్నారు. ఇలా పేరు మార్చడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందన్నారు



.webp)


